30 June, 2026 | 2:55 AM

ప్రజావాణికి జిల్లా అధికారులు డుమ్మా

30-06-2026 01:54 AM
  1. ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్
  2. గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశం

సంగారెడ్డి, జూన్ 29: ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు త ప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరయ్యే అధికారులపై లు తీసుకుంటామని హెచ్చరించా రు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ని ర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, ఆర్డీఓ రాజేందర్తో కలి సి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అందిన అర్జీలను పరిశీలించి, వా టి సత్వర పరిష్కారం కోసం సంబంధిత శా ఖల అధికారులకు పంపించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులు హాజరు వివరాలను శాఖల వారీగా పరిశీలించిన కలెక్టర్, ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలువు రు అధికారులు గైర్హాజరైనట్లు గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికా రులకు షోకాజ్ మెమోలు జారీ చేసి సంజాయిషీ కోరాలని ఆదేశించారు.

ఇకపై ప్రజా వాణికి గైర్హాజరయ్యే అధికారులపై క్రమశిక్ష ణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు అత్యంత ముఖ్యమైన వేదిక అని, అధికారులు దాని ప్రాధాన్యతను గుర్తించి విధిగా హాజరుకావాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ప్ర తి వినతిని అంకితభావంతో పరిశీలించి, నిర్ణీ త గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  జి ల్లా వ్యాప్తంగా ప్రజావాణికి మొత్తం 75 వినతు లు అందాయి.