22 June, 2026 | 3:42 AM

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నీట్ యూజీ పరీక్షలు

22-06-2026 02:11 AM

పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం, జూన్ 21 (విజయక్రాంతి): నీట్ యూజీ 2026 పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదివారం కొత్తగూడెం పట్టణంలోని  సింగరేణి ఉమెన్స్ కళాశాల, రామచంద్ర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న,నీట్ పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

పరీక్ష ముగిసే వరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 163BNSS అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోని సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల తనిఖీ విధానం, ఇతర అంశాలపై  అధికారులకు సూచనలు చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే పోలీసు అధికారులకు తెలియజేయవలసిందిగా అధికారులను కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు భంగం కలిగించిన, నిషేధాజ్ఞలు మీరిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.