22 June, 2026 | 3:48 AM

మహోన్నత దార్శనికుడు జయశంకర్ సార్

22-06-2026 02:11 AM
  1. ఆయన జీవితం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తి 
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి) : చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకే అంకితమైన జయశంకర్ సార్ జీవితం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తి అని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఆదివారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా హరీశ్‌రావు ఘన నివాళులు అర్పిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన మహోన్నత దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్ధులమై ఉంటామని పునరుద్ఘాటించారు.