calender_icon.png 3 July, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పార్టీకి జిల్లా అధికార ప్రతినిధి పోతరవేన క్రాంతి రాజీనామా

02-07-2025 12:52:44 PM

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి,  మంథని మండల ఇన్చార్జి పోతరవేన క్రాంతి కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం తనను చాలా బాధించిందని క్రాంతి అవేదన వ్యక్తం చేశారు. తనను ఇన్ని రోజులు పార్టీ లో గౌరవం ఇచ్చిన జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి, మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి కి క్రాంతి కృతజ్ఞతలు తెలిపారు.