02-07-2025 12:55:39 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
వాంకిడిలో ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే హెచ్చరించారు. బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులలోని రికార్డులను ,సరుకు నిల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల వివరాలను షాప్ ఎదుట బోర్డుపై నమోదు చేయాలని సూచించారు.
ఎరువులను బ్లాక్ చేసినట్లు తెలిస్తే వారిపై శాఖా పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు దశలవారీగా ఎరువులు వస్తాయని రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎరువులను రైతులందరికీ అందజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్ తదితరులు ఉన్నారు.