calender_icon.png 25 August, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

25-08-2025 12:00:00 AM

చేగుంట, ఆగస్టు 24 : మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నుకున్నారు. చేగుంట శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ పర్యవేక్షకులు బి మల్లేష్ గౌడ్, జిల్లా యువజన క్రీడల శాఖ బాధ్యులు జి రాజు, ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ ఏ కృష్ణ ల పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

గత 8 సంవత్సరాల నుండి జిల్లా వాలీబాల్ క్రీడాకారులకు సేవలందించిన సౌమ్యుడు సంఘ సేవకర్త మూడవసారి అధ్యక్షునిగా అయిత పరంజ్యోతి, ఉపాధ్యక్షులు శృతి గీత, జనరల్ సెక్రెటరీ కమ్మరి రవీందర్, కోశాధికారి జిన్నారం మైపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శులు ఏ మహేందర్ గౌడ్, అల్లి నరేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మహేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జి రాజేందర్, ఏ ప్రవీణ్ యాదవ్, ఎండి ఇర్ఫాన్, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ పెంటా గౌడ్, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.