24-08-2025 11:15:16 PM
కోదాడ: అర్ధరాత్రి ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరు లేని సమయాన్ని గమనించి ఇంట్లోకి జోరబడి బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, సుమారు రూ.2 లక్షల నగదు చోరీకి పాల్పడ్డ ఘటన ఆదివారం కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీమన్నారాయణ కాలనీలో చింతలపాటి శ్రావణ్, భార్య ఆకాంక్ష అద్దె ఇంట్లో ఉంటున్నారు.
ఇద్దరు డాక్టర్లు కావడంతో భార్య ఆకాంక్ష శనివారం సూర్యాపేట తల్లి ఇంటికి వెళ్లగా శ్రావణ్ హాస్పిటల్ లో పేషంట్లతో బిజీగా ఉండి శనివారం రాత్రి హాస్పటల్లోనే ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో చోరికి పాల్పడ్డారు.గతంలో రెండు,మూడు సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో అద్దెకు ఉన్న బ్యాంక్ ఉద్యోగులు ఉన్న సమయంలో కూడా దొంగలు పడ్డారు.ఘటనా స్థలానికి చేరుకొని పట్టణ సీఐ శివశంకర్,క్లూస్ టీం, ఆధారాలు సేకరిస్తున్నారు.