calender_icon.png 25 August, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి వినాయకులను పూజించండి

24-08-2025 11:19:05 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): ప్రజలందరూ పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయకులను పూజించాలని సిద్దిపేట అసిస్టెంట్ డిపో మేనేజర్ మహేశ్వరి అన్నారు. జిల్లా కేంద్రంలోని మోడ్రన్ బస్ స్టాండ్ లో పర్యావరణ ప్రేమికులు రాధారి నాగరాజు, డా. డిఎన్ స్వామి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పూజించండి అని చైతన్య పరిచేలా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను  ఆమె రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలలో పర్యావరణ పట్ల చైతన్య పరిచేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు.