24 April, 2026 | 12:23 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

ఆసుపత్రిలో అపరిశుభ్రతను చూడలేక డీఎంహెచ్ఓ గరం... గరం..!

03-07-2025 07:32 PM

మీటింగ్ల పేరుతో టైం వేస్ట్ చేయడం ఎంటీ..?

వైద్యాధికారి స్రవంతిని మందలించిన డీఎంహెచ్ఓ డాక్టర్. చంద్రశేఖర్..

పెన్ పహాడ్: సర్కారు దవాఖానా అంటేనే ప్రజలకు నమ్మకం కలిగించాలి.. దవాఖానాకు వచ్చే రోగికి ఆహ్లాదకరమైన ఆసుపత్రిని చూస్తేనే సగం రోగం తగ్గాలి.. రోగికి మన రిసీవింగ్.. మనం అందించే వైద్య సేవలే ప్రజలు, రోగులకు ఆసుపత్రి మీద, ప్రభుత్వం మీద మరింత నమ్మకం కలిగించాలే తప్పా.. ఈ ఆసుపత్రి ఇలా తయారు కావడం ఏంటని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్(DMHO Dr. Chandrasekhar) పెన్ పహాడ్ మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతిపై గరం గరం అయ్యారు. బుధవారం మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తణిఖీ చేపట్టి ఆసుపత్రి పరిసరాలు, ఆసుపత్రిలోని పలు గదులను ఆయన పరిశీలించి సిబ్బందిపై మండిపడ్డారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన ఆసుపత్రి.. ఇప్పుడు అపరిశుభ్రతతో కొట్టుమీట్టాడడం చూస్తే భాధ్యతల మీద మచ్చ పడినట్లుగా తెలుస్తుందన్నారు.

అప్పటికే మీటింగ్ హాల్లో జరుగుతున్న ఆశాల మీటింగ్ ను డీఎంహెచ్ఓ హాజరై పలు అంశాలపై మీద చర్చ చేపట్టారు. మీటింగ్లో గత నెలలో ప్రస్తావించిన అంశాలు పరిస్కారం అయ్యాయా.. లేదా.. కారణాల మీద చర్చ చేపట్టాలే తప్పా ఇలా రోజంతా తరబడి మీటింగ్ పేరుతో ఆశాల టైం వేస్ట్ చేయడం ఏంటని.. వారు ఎప్పుడు గ్రామానికి చేరుకొని సేవలు ఎప్పుడు అందించాలని డాక్టర్ స్రవంతిని ప్రశ్నించారు. కాగా ఇప్పటికే ఆసుపత్రి నిధుల దుర్వినియోగంపై ఆరోపనలు ఎదుర్కోంటున్న హెచ్ఈఓ చంద్రశేఖర్ రాజు పీ హెచ్ సీకి డీఎంహెచ్ఓ రాగానే కొద్ది సేపటికే బాధ్యతారహితంగా అక్కడి నుంచి జారుకోవడంపై ఆరోగ్య సిబ్బంది గుసగుసలాడుకున్నారు. కాగా వ్యాక్సినేషన్, మందుల రిజిస్టర్, హాజరు రిజిష్టర్, ప్రసవాల వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. వారి వెంట సిబ్బంది బూతరాజు శ్రీనివాస్, సైదులు, ఎల్టీ రాజు, ఫార్మసిస్ట్, ఏఎన్ఎంలు, ఆశాలు ఉన్నారు.