03-07-2025 07:36:43 PM
క్వాలిటీ జిఎం గోపాల్ సింగ్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో నాణ్యమైన ఉత్పత్తిని సాధించి వినియోగదారులకు సకాలంలో అందజేయాలని బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ గోపాల్ సింగ్(General Manager Gopal Singh) అన్నారు. రీజియన్ క్వాలిటీ జీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా గురువారం ఏరియా పర్యటనకు వచ్చిన ఆయనను ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్, ఏరియా అధికారులు కలిసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం, ఇతర అధికారులతో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా క్వాలిటీ జిఎం మాట్లాడుతూ... నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని సాధించి వినియోగదారులకు సకాలంలో రవాణా చేయడం సింగరేణి సంస్థ లక్ష్యమని, లక్ష్య సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య, ఐఈడి ఎస్ఇ కిరణ్ కుమార్, ఏరియా సర్వే ఆఫీసర్ భుక్య దేశాయ్, క్వాలిటీ ఇంచార్జ్ ప్రదీప్ లు పాల్గొన్నారు.