డీఎంకేకు 164, మిత్రపక్షాలకు 70
- తమిళనాడులో ఖరారైన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ స్థానాలు
- కొలతూరు నుంచి పోటీలో సీఎం స్టాలిన్
చెన్నై, మార్చి 28: తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. 234 అసెం బ్లీ స్థానాలకు గాను 164 స్థానాల్లో డీఎంకే, 70 స్థానాల్లో మిత్రపక్షాలు బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు డీఎంకే పార్టీ కార్యాలయం ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ ఖరారైన స్థానాలపై శనివారం ప్రకటన విడుదల చేసిం ది. కాంగ్రెస్ పార్టీకి 28, డీఎండీకేకు 10, వామపక్ష పార్టీలకు 10, వీసికేకు 8, ఐయూఎంఎల్ 2, ఎండీఎంకే 4, ఎంఎంకే 2, ఎంజేకే, ఎస్ డీపీఐకు చెరో స్థానం కేటాయించింది.
ఈ సం దర్భంగా డీఎంకే అభ్యర్థులు పోటీ చేయనున్న తొలి జాబితాను కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ విడుదల చేశారు. కొలతూరు నుంచి మరోసారి స్టాలిన్ పోటీ చేయనుండగా, చెపాక్ ట్రిప్లికేన్ నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పోటీ చేయనున్నారు. బోడినాయగనూర్ నుంచి పన్నీర్ సెల్వం, కోయంబత్తూర్ సౌత్ నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలు పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఒకే విడతలో తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.




