calender_icon.png 3 November, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా బిడ్డకు న్యాయం చేయండి!

02-11-2025 12:00:00 AM

  1. చంటి బిడ్డతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా 
  2. నల్లగొండ జిల్లా నెల్లిబండలో ఘటన

నకిరేకల్, నవంబర్ 1 (విజయక్రాంతి): ప్రియుడి కారణంగా తనకు పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు చంటిబిడ్డతో ప్రియురాలు ధర్నా చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన రేణుకకు నకిరేకల్ మండలం నెలిబండ గ్రామానికి చెందిన బోగిళ్ళ అశోక్‌తో వివాహం జరిగింది.

వివాహం జరిగిన కొన్నేళ్లకే అశోక్ అనారోగ్యంతో మృతి చెందాడు. అశోక్ ఉన్నప్పటినుంచే అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఓరుగంటి విష్ణుతో రేణుకకు వివాహేతర సంబంధం ఉంది. అశోక్ మృతి చెందిన తర్వాత అండగా ఉంటానని విష్ణు నమ్మబలికాడు. అతడి వల్ల రేణుక గర్భందాల్చగా రెండు, మూడుసార్లు అబార్షన్లు చేయించాడు. మరోసారి కూడా గర్భం తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో.. పెళ్లి చేసుకుం టానని నమ్మించి అబార్షన్లు చేయించడం ఏమిటని రేణుక నిలదీసింది.

దీంతో “నాకు పెళ్లుంది, ఇద్దరు పిల్లలు. మనిద్దరి కులాలు కూడా వేరు. నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను” అని విష్ణు అనడంతో ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలై దూరంగా ఉంటున్నారు. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడితే ప్రెగ్నెన్సీ తీయించుకుంటే రూ.5 లక్షలు ఇస్తానని విష్ణు చెప్పా డు. దీనికి రేణుక ఒప్పుకోలేదు.

అప్పటి నుంచి విష్ణు ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఓ బిడ్డకు రేణుక జన్మని చ్చింది. దీంతో ఆ బిడ్డకు నాకు న్యాయం చేయాలంటూ విష్ణు ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ వద్ద పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహిం చినట్టు సమాచారం.