24 July, 2026 | 7:37 AM

అధైర్యపడొద్దు అండగా ఉంటా

31-05-2024 02:38 AM

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 30 (విజయక్రాంతి): గుండెపోటుతో మరణించిన జైనూర్ మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు మెస్రం లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కోవలక్ష్మి భరోస నింపారు. గురువారం ఆయన అంతక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..  లక్ష్మణ్ భార్యను ఓదార్చారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. లక్ష్మణ్ జైనూర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కార్యకర్తలకు అండగా ఉండే వారని అన్నారు.