ఉరేసుకొని ముగ్గురు బలవన్మరణం
రాజన్న సిరిసిల, మే30 (విజయక్రాంతి): వేర్వేరు కారణాలతో ఉరేసుకొని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం రాజన్న సిరిసిల్లలో చోటుచేసుకున్నది. వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువుతండాకు చెందిన మమత (21) అనుమా నాస్పద రీతిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి ఓ యువకుడు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యు లు అతని ఇంటిపై దాడి చేశారు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ముస్తాబాద్ మండలం గూడెంలో బెదుర రాజయ్య (75) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట మండ ల కేంద్రానికి చెందిన కొలకానీ కాశయ్య, సరళ దంపతుల రెండో కుమారుడు నవీన్ (21) బుధవారం అర్ధరాత్రి ఇంట్లో దూలానికి ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైలెన్సర్ల ద్వారా శబ్ద కాలుష్యం సృష్టిస్తే సహించబోమని, వాహనదారుడితోపాటు మెకానిక్‌లపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టీ నారాయణ హెచ్చరించారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం 122 బైకుల సంబంధించిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయించారు.






