ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్
కరీంనగర్ సిటీ, 30: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తెలిపారు. కరీంనగర్‌లోని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జీవీఆర్ మాట్లాడు తూ.. కరీంనగర్ జిల్లా నుంచి వెయ్యి మంది బీఆర్‌ఎస్ నాయకులతో జూన్ 1న సాయం త్రం గన్‌పార్క్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ తీయనున్నట్టు తెలిపారు. 2న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొననున్నట్టు చెప్పారు. జూన్ 3న కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌భవన్ ఆవరణలో జాతీయ జెండాతోపాటు బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తామని పేర్కొన్నారు.






