‘ఇంజినీరింగ్’ ఫీజులు వసూలు చేయొద్దు
- నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం
- ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం యథాతథంగా కొనసాగించాలి
- జులైలో 5 లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం
- ముఖ్యమంత్రికి లేఖ రాసిన జాతీయ ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంజనీరింగ్ కౌన్సిల్ లో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని, గత 18 సంవత్సరాల క్రింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేసిన విధంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు విద్యానగర్లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ కౌన్సిల్ విధానం పై ప్రభుత్వం తరఫున స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు గందరగోళంకు గురవుతున్నారన్నారు.
అందుకే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని గత 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం తెచ్చేనా జీవో నెంబర్ 8,9 లతో స్పష్టత లేకపోవడం వలన తీవ్ర గందరగోళం ఏర్పడుతుందన్నారు . ఫీజులు విద్యార్థుల ఖాతాలోకి వేస్తామని పేర్కొనడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టమని ఒత్తిడి తెచ్చి అవకాశం ఉందన్నారు. పైగా ప్రభుత్వం ఫీజులు విద్యార్థులు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రింద అరెస్టు చేస్తామని భయపెట్టడంతో విద్యార్థులలో భయందోళనలు చదువు పట్ల అనాసక్తి ఏర్పడుతుందన్నారు .
న్యాయమైన ఈ సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేస్తే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. జులై మొదటి వారంలో ఐదు లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ నిర్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సమావేశంలో మోడీ రాందేవ్, అనంతయ్య, రాజేందర్, భీం రాజు, కూరెల్ల మహేష్, నిఖిల్ పటేల్, పై. వెంకటేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.






