20 June, 2026 | 2:41 AM

అర్హులైన వారి ఓట్లు తొలగకుండా చూడాలి

20-06-2026 12:00 AM

మాగంటి సునీత గోపీనాథ్

జూబ్లీహిల్స్, జూన్ 19 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో అర్హులై వారి ఓట్లు తొలగకుండా చూడాలని బీఆర్‌ఎస్ అనుబంధ బూత్ లెవల్ ఏజెంట్లకు ఆ పార్టీ జూబ్లీహిల్స్ ఇంచార్జి మాగంటి సునీత గోపీనాథ్ సూచించారు. కార్యక్రమానికి సంబంధించి ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సిద్ధార్థనగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సునీత గోపీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి బూత్ కు బూత్ లెవల్ ఏజెంట్లను పార్టీ తరపున నియమించడం జరిగిందన్నారు.

వారు ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హుల ఓట్లను కాపాడుతూనే నకిలీ ఓట్లను తొలగించడంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు. అధికారులను సమన్వయపరుచుకుంటూ ఎస్‌ఐఆర్ ను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 407 బూత్ ల ఏజెంట్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.