నీళ్లు ఉన్నాయని వరి వేయొద్దు!
12-08-2026 12:25 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
పెద్దమందడి, ఆగస్టు 11 (విజయక్రాంతి) : ప్రస్తుతం నీరు అందుబాటులో ఉందని తొందరపడి వరి సాగు చేసి తర్వాత ఇబ్బందులు పడొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందని, రైతులు వేరుశనగ, మినుములు, కూరగాయలు, పామాయిల్ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. మంగళవారం పెద్దమందడి రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.






