9 June, 2026 | 4:00 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం   •   పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం వనికిన జనం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •  

భయపెట్టేలా ఐటీ నోటీసులు ఇవ్వకండి

22-08-2024 12:30 AM

ఆదాయపు పన్ను శాఖ వార్షికోత్సవంలో సీతారామన్

న్యూఢిల్లీ, ఆగస్టు 21: పన్ను చెల్లింపుదారులకు పంపించే నోటీసులు, లేఖలు భయపెట్టేలా ఉండకూడదని, వారికి అర్థమయ్యే రీతిలో సరళమైన పదాల్లో ఉండాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. 165వ ఇన్‌కమ్ టాక్స్ వార్షికోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ పన్ను చెల్లింపు       దారులతో అధికారులు స్నేహపూర్వక ధోరణిని అవలంబించాలని కోరారు. నోటీసు అసెస్సీకి స్పష్టంగా అర్థమయ్యేరీతిలో ఉండాలని, నోటీసు ఎందుకు జారీచేస్తున్నారో కారణం తెలియపర్చాలని సూచించారు. పన్ను రిఫండ్స్ మరింత వేగవంతం చేసే అవకాశం ఉన్నదని చెప్పారు.