14 August, 2026 | 3:48 AM

బాధ్యతల విస్మరణ

14-08-2026 01:10 AM
  1. ఇన్‌చార్జ్ మంత్రులు, బీఎల్‌ఏలపై సీఏం రేవంత్ ఆగ్రహం
  2. ఓట్ల తొలగింపునకు కారణాలు తెలుసుకోవాలి 
  3. తక్షణమే మంత్రులు పార్లమెంట్, అసెంబ్లీ.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలి 
  4. సర్‌పై జూమ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): సర్ ప్రక్రియలో భాగంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, ఇన్‌చార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ వరకు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాం టి పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణ మే సంబంధిత ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులతో సమీక్ష నిర్వహిం చాల్సిన అవస రం ఉందన్నారు.

రెండు రోజులు క్షేత్ర స్థాయి కి వెళ్లి జిల్లాల్లో సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సర్ (ఎస్‌ఐఆర్)ప్రక్రియపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమా ర్‌గౌడ్ అధ్యక్షతన గురువారం జూమ్ సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి నివేదిక తయారు చేయాల్సిందేనని, అసెంబ్లీ ఇన్‌చార్జులు 4 రోజులు నియోజకవర్గంలో ఉండి సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్క రించాలన్నారు.

సరైన కార్యాచరణతో ముం దుకు వెళ్లకపోతే పార్టీ ఉపేక్షించదని, ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని సీఎం హెచ్చరించారు. పకడ్బందీ కార్యాచరణతో వెళ్లకపోతే భవిష్యత్ లో రాజకీయంగా పెద్దనష్టం జరుగుతుందన్నారు. సర్‌లో సమస్యలను పరిష్కరించడంతో పాటు బీజేపీ, బీఆరెస్ కలిసి చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్ర ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. 

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు 

తెలంగాణలో ఎన్నికల కమిషన్ 73 లక్షల ఓట్లు తొలగించడం.. 64 లక్షల ఓట్లు అనమిలిస్‌గా పెట్టడాన్ని చాలా సీరియస్‌గా తీసు కోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సూచించారు. ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా ఓట్ల తొలగింపు జరగలేదన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇది బీజేపీ, ఎన్నికల కమిషన్ చేస్తున్న కుట్రలో భాగంగా అనుమానాలు ఉన్నాయని, ఇతర రాష్ట్రాలలో జరిగిన అంశాలు, గత అనుభవాలు దృష్టి లో పెట్టుకోవాలన్నారు.

ఓట్ల తొలగింపు కుట్ర రాజకీయాలు అత్యంత ప్రమాదమని, బీఎల్‌ఏలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ఓటర్లు తిరిగి ఓటు హక్కు పొందేలా చూడడం బీఎల్‌ఏ పాత్ర కీలకమని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నా యకులు ఇప్పుడు డిజిటల్ కానీ ఓట్లను, అనమాలిస్ ఓట్ల చాలా తీక్షణంగా పరిశీలించాలన్నారు. 

ఇక్కడ భవిష్యత్‌లో జరగ బోయే ఎన్నికలకు ఇవ్వే ఓట్లు ఉంటాయన్నారు. మన నిర్లక్ష్యం చాలా ప్రమాద కరమైన పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరిం చారు. నిర్లక్ష్యంగా ఉంటే ఎంత పెద్ద లీడరైనా చర్యలు తప్పవన్నారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చే వరకు నియోజకవర్గాల్లో ఈ పని మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ఉండొద్దన్నారు. 

ఓట్ల తొలగింపు అత్యంత ప్రమాదకరం 

దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలో ఓట్ల తొలగింపు అత్యంత ప్ర మాదకరమైన అంశమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ లోపాయకారి కుట్ర జరిగినట్టు అనిపిస్తుం దన్నారు. బెంగాల్‌లో జరిగిన దానికంటే ఇక్కడ ఎక్కువ ఓట్లు తొల గించారని తెలిపారు. 3.3 కోట్ల ఓట్లలో కోటి 30 లక్షల ఓట్లు తొలగించే కుట్ర అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇన్‌చార్జ్ మంత్రులు చాలా సీరియస్‌గా వర్క్ చేయాలని, మీ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతి ఓటును పరిశీలించాలని ఆయన సూచించారు.