‘కంటోన్మెంట్’ అసెంబ్లీ స్థానానికి తొమ్మిది మంది నామినేషన్లు
23-04-2024 02:01 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీగణేష్ నారాయణన్, బీజేపీ నుంచి ఎం.ఎ.శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నుంచి జి.నివేదిత, బహుజన్ ముక్తీ పార్టీ నుంచి ఉప్పలేటి రాజేందర్, స్వతంత్ర అభ్యర్థులుగా సంజీవులు, బండారు నాగరాజు, రేకల సైదు లు, దండెం రత్నం, రాజ్‌కుమార్ ఒక్కో నామినేషన్ సెట్‌ను దాఖలు చేశారు.






