20 April, 2026 | 10:00 PM

Breaking News

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు

20-04-2026 08:20 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా.. వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే (స్థానిక సంస్థలు) ఆర్డీవోలు రమేష్ బాబు, మహేశ్వర్ తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 238 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా కరీంనగర్ నగరపాలిక సంస్థ నుంచి 59 వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.