ప్రైవేటు పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్మొద్దు
సర్క్యులర్ జారీ చేసిన హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (విజయక్రాంతి) : ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్, టై, బెల్ట్‌లను అమ్మొ ద్దని హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి శుక్ర వారం సర్యులర్ జారీ చేశారు. ఈ నెల 26న ‘విజయక్రాంతి’లో వచ్చిన ‘బుక్స్ మావద్దే కొనాలి’ అనే కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలోని రాష్ట్ర, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈవోలు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఇన్‌స్పెక్టర్లకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిరంతరం పర్యవేక్షించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.






