22 July, 2026 | 10:48 PM

అమెరికాలోనూ మల్లారెడ్డి హల్‌చల్

01-06-2024 02:55 AM

మేడ్చల్, మే 31 : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అమెరికాలోనూ హల్‌చల్ చేశారు. ఏదో ఒక విధంగా చలోక్తులు విసురుతూ నెట్టింట్లో వైరల్ అయ్యే మల్లారెడ్డి అమెరికాలో జరుగుతున్న అంత ర్జాతీయ విద్యాసదస్సులో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థా యిలో ఉన్న పెద్ద యూనివర్సిటీలు పాల్గొంటున్న సదస్సులో తమ విద్యాసంస్థ తరపున హాజరవడం సంతోషంగా ఉందన్నారు. చైనా, జపాన్, పొర్చుగల్, భారత్ తదితర దేశాలకు చెందిన వర్సిటీలు ఈ సదస్సులో పాల్గొన్నాయన్నారు. ఇంత పెద్ద సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి తమ యూనివర్సిటీ తరపున స్టాల్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు.