15 August, 2026 | 1:47 AM

రైతుల భూములను లాక్కుని వారి నోట్లో మట్టి కొట్టొద్దు

15-08-2026 12:00 AM

బీఆర్‌ఎస్ నేత నాగం శశిధర్ రెడ్డి

నాగర్ కర్నూల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): రైతుల భూములను లాక్కుని వారి నోట్లో మట్టి కొట్టొద్దని బీఆర్‌ఎస్ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంతటి గ్రామంలో డిండి ప్రాజెక్టు కోసం భూ సేకరణను చేపడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. శుక్రవారం మంతటి గ్రామంలో పంట పొలాలను పరిశీలించి డంపింగ్ యార్డ్ కోసం సుమారు 125 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.

రెండు పంటలు పండే భూములను అడిట్ కెనాల్ డంపింగ్ యార్డ్ కోసం తీసుకోవడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారని చెప్పారు. డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఎస్‌ఎల్బీసీతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతుల సమస్యపై జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించాలని డిమాండ్ చేశారు.