యాప్‌తో వద్దు.. ఆధార్‌తోనే యూరియా ఇవ్వండి
పెద్దేముల్‌లో రైతుల రాస్తారోకో..
రెండు గంటల పాటు స్తంభించిన తాండూర్ రహదారి
తాండూరు ఆగస్టు 14, (విజయక్రాంతి): యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా పంపిణీలో యాప్ విధానం తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆ రోపిస్తూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మ ండల కేంద్రంలో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. తాండూర్‌కోట్పల్లి, సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘానికి 560 యూరియా బస్తాలు వచ్చినట్లు రైతులు తెలిపారు. అయితే యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉండటంతో చాలామంది రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్పు అవగాహన ఉన్న కొద్దిమంది రైతులకే బుకింగ్ సులభంగా జరుగుతోందని, మరికొందరు ఎంత ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని ఆరోపించారు. యాప్తో వద్దు.. ఆధార్తో యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.






