5 June, 2026 | 3:21 AM

మోసపూరిత కాల్స్ నమ్మవద్దు

05-06-2026 01:36 AM

 కమిషనర్ రాజశేఖర్ రెడ్డి

జనగామ, జూన్ 4 (విజయక్రాంతి): మున్సిపాలిటీ దృష్టికి వచ్చిన సమాచారం మేర కు, కొందరు వ్యక్తులు తాము మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది అని చెప్పుకొని ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, బకాయిల చెల్లింపు, జరిమానాలు మొదలైన వాటి పేరుతో వ్యాపా రులకు ఫోన్ కాల్స్ చేసి, గూగుల్ పే, ఫోన్ పే,  క్యూఆర్ కోడ్లు లేదా వ్యక్తిగత బ్యాంక్ ఖా తాలకు నగదు పంపాలని కోరుతున్నట్లు తె లిసింది.

ఈ విధమైన కాల్స్, సందేశాలు, లిం కులు, క్యూఆర్ కోడ్లు జనగామ మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేనివని స్పష్టంగా తెలియజేయడమైనది. మున్సిపాలిటీ తరఫున ఎవరూ వ్యక్తిగత ఫోన్ నంబర్ల ద్వారా లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు చెల్లించమని సూచించరు. ట్రేడ్ లైసెన్స్ సంబంధిత చెల్లింపులు అధికారిక మున్సిపల్ పోర్టల్ లేదా మున్సిపల్ కార్యాలయం ద్వారా మా త్రమే నిర్వహించవలెను.

కావున వ్యాపారు లు మరియు ప్రజలు ఇటువంటి మోసపూరిత కాల్స్, సందేశాలు, లింకులు, క్యూఆర్, కోడ్లను నమ్మరాదు. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే జనగామ మున్సిపాలిటీ కార్యాలయాన్ని సంప్రదించి ధృవీకరించుకోవాలి. ఎవరైనా మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.