17-02-2026 12:40:48 AM
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాం తి): దేశంలోని నిషేధిత హెచ్‌టీ కాటన్ విత్తనాలు, గ్లుఫైసెట్ రసాయన మందులను రైతులు వాడొద్దని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. వీటి విషయంలో అధి కారులు కూడా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సోమవారం రైతు కమిషన్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మార్కెట్‌లోకి నకిలి విత్తన కంపె నీలు వస్తున్నాయని, వాటిని కొని రైతులు మోసపోయే ప్రమాదం ఉందన్నారు. గ్లుఫైసెట్ గడ్డి మందు వాడటం వల్ల పంటలు దెబ్బతింటాయన్నారు. అంతే కాకుండా కుటుంబంలో కలహాల వల్ల కూడా రైతులు వాటిని తాగి చనిపోతున్నారని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు. హెచ్‌టీ కాటన్, గ్లుఫైసేట్ పురుగు మందు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొచ్చి అమ్ముతున్నారని అధికారులకు కమిషన్‌కు వివరించారు.
నారాయణపేట జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 96 క్వింటాళ్ల హెచ్‌టీ కాటన్ విత్తనాలను పట్టుకున్నట్లు చెప్పారు. వారిపై కేసులు పెట్టి నా కూడా మార్పు రావడం లేదని వివరించారు. సమీక్షలో కమిషన్ సభ్యులు గోపా ల్‌రెడ్డి, భవానీరెడ్డి, భూమి సునీల్, మెంబర్ సెక్రటరీ గోపాల్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కొండారెడ్డి పల్లి నుంచే భూసార పరీక్షల కిట్లు
ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి నుంచే భూసార పరీక్షల కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఆ తర్వాత జూపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన ఉంటుందన్నారు.