30 June, 2026 | 5:42 PM

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

05-05-2026 06:00 PM

- వరంగల్ సి పి.సన్‌ప్రీత్ సింగ్

హనుమకొండ,(విజయక్రాంతి): గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గో రక్షణ కమిటీలతో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో  ముందుగా మూగ జీవాల అక్రమ రవాణాకు నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై గో రక్షణ సమితి సభ్యులను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతం వాహన తనీఖీలు నిర్వహించబడుతాయని. ఇందుకోసమని ప్రత్యేకంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని. అదే విధంగా గోవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం వుంటే తక్షణే పోలీసులకు సమాచారం అందించాలి.

కాని గోవులను రక్షించాలనే క్రమంలో  గో రక్షణ కమిటీ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, ముఖ్యంగా ఇదే సమయంలో అక్రమంగా గోవుల తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు రక్షణ కమిటీ సభ్యులు వాహనాలపై,  రవాణా చేస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపటం చాలా ప్రమాదకరమని, అలాగే అక్రంగా మూగ జీవాలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకునే సమయంలో  నిందితులు దాడులకు పాల్పడే అవకాశాలతో పాటు శాంతి భద్రతలు సమస్యలు రావచ్చని,

తద్వారా ప్రమాదంలో పడే అవకాశాలు  వున్నాయని, ఇకపై స్థానికంగా వున్న గో రక్షణ కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లను స్థానిక పోలీసులతో షేర్ చేసుకోవడం ద్వారా నకలీ ఫోన్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని, దీని ద్వారా త్వరితగతిన గోవులను రక్షించే అవకాశం కలుగుతుందని అన్నారు.మూగ జీవాలను అక్రమంగా తరలించే వారిని పట్టుకోవడం పోలీసుల బాధ్యతని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తెసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.