చెరువులు ఉన్నది మోటార్ల కోసమేనా?
- చెరువు కింద ఉన్న రైతులు తీవ్ర ఆందోళన
గ్రామ రాజకీయ నాయకుల స్వలాభమే ముఖ్యమా
దేవరకద్ర మార్చి 17 : చెరువు ఏదైనా అడుగు పారితే చెరువు కింద ఉన్న పంటల కోసం నీరు కావలసి ఉంటే తూము ద్వారా సంబంధిత అధికార యంత్రాంగం తో పాటు మత్స్య శాఖ సభ్యుల అనుమతి తీసుకుని మీరు విడుదల చేయాల్సి ఉంటుంది. చేపల పట్టేందుకే చెరువులో నుంచి నీరు పూర్తిగా నిర్వీర్యం చేసేలా వృధా అయ్యేలా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమో ఆ గ్రామంలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కానీ గోపన్ పల్లి గ్రామ చెరువు లో చేపలు పట్టడం కోసం కొంత మంది వ్యక్తులు చెరువులో ఉన్న నీటిని బయటికి వృధా గా మోటార్లు పెట్టి కొడుతూన్నారు. దీంతో చెరువు కింద ఉన్న రైతులు ఆ నీటిని చెరువు నుండి బయటికి కొ ట్టడం తో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండ్రు.ఇంకా నెల రోజుల లో రైతులు వేసుకున్న వారి పంట పూర్తి అవుతుందని, చెరువు లో ఉన్న నీరును బయటికి తీస్తే భూగర్భ జలం తగ్గి త మ బోర్లు నీరు వచ్చే అవకాశం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాని ప్రభుత్వ అధికారులకు దృష్టికి తీసుకెళితే పట్టించుకోవడం లేదని, రైతులు బాధపడుతున్నారు.
అంతగా చేపలు పట్టుకోవాలని ఉంటే చెరువులోని చెరువులోనే ఒక చిన్నప్పటి కట్ట ఏర్పాటు చేసి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నీరుని వేరుచేసి చేపలు పట్టుకోవాల్సిది పోయి ఇలా చెరువులో నుంచి పూర్తిగా నీరు తొలగించేందుకు తీసుకున్న చర్యలు ఆ ప్రాంతం రైతులతో పాటు గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలుస్తుంది.




