15 April, 2026 | 12:33 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలికి డాక్టరేట్

24-02-2026 12:00 AM

మెదక్, ఫిబ్రవరి 23(విజయ క్రాంతి) :  మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న బి.నిదర్శిని డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే.హుస్సేన్  తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పరిశోధన రంగంలో కళాశాల అధ్యాపకులు ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు. పరిశోధనలు వ్యక్తిగతంగా కెరీర్ పరంగా అధ్యాపకులకు చాలా అవసరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బి.నిదర్శిని మాట్లాడుతూ రాజస్థాన్ లోని జగదీష్ ప్రసాద్ జబర్మల్  టిబ్రేవాలావిశ్వవిద్యాలయంలో డాక్టర్ ప్రసాద్ పెద్ది పర్యవేక్షణలో అనాలసిస్ ఆఫ్ డేటా సెలక్షన్ అండ్ డేటా ప్రాసెసింగ్ ఫర్ ఐడెంటిటీ పాటరన్స్ బై డేటా మైనింగ్ టెక్నిక్స్ అనే అంశం పై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ పొందినట్లు తెలిపారు.

స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సింహారెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ తిరుమలరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ శరత్ రెడ్డి, స్టాఫ్  క్లబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ నాగేందర్ రావు, డా.శ్రీలత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.