18 April, 2026 | 12:06 PM

Breaking News

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   సత్తుపల్లి జాతీయ రహదారిపై సాఫీగా ప్రయాణం   •  

పోనుగోటి మౌనికకు డాక్టరేట్

18-06-2025 12:00 AM

ప్రదానం చేసిన కేఎల్ యూనివర్సిటీ

గుంటూరు, జూన్ 17 (విజయ్‌క్రాంతి): హిందూ ఫార్మసీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న పోనుగోటి మౌనికకు కేఎల్‌యూ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి నాగభూషణం తెలిపారు. మంగళవారం హిందూ ఫార్మసీ కళాశాలలో ప్రొఫెసర్ మౌనికకు ఏర్పాటుచేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక నిర్దిష్ట రంగంలో పరిశోధన చేసి, ఆ రంగంలో లోతైన పరిజ్ఞానం, నైపుణ్యం  సంపాదించడమే డాక్టరేట్ అని తెలిపారు.

డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్ మౌనిక మాట్లాడుతూ.. కిడ్నీల్లో రాళ్లు రాకుండా, వచ్చిన ఎంత పెద్ద సైజు రాళ్లనైనా కరిగించే విధంగా పరిశోధన చేసినట్టు తెలిపారు. కేఎల్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెసర్ గుంటుపల్లి చక్రవర్తి పర్యవేక్షణలో ఖెల్లిన్, మోరిన్ హైడ్రేట్ యొక్క డైయూరిటిక్, యాంటీయురోలీథీయాటిక్ సామర్థ్యాన్ని ఇథలిన్ గ్లైకాలిక్ ప్రేరిత యూరోలిథియాసిస్ అంశంపై విస్టార్ ఎలుకలపై పరిశోధన చేసినట్టు తెలిపారు.

దీనికిగాను కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో హిందూ కళాశాల కార్యదర్శి డాక్టర్ ఎస్ మధుసూదన్‌రావు, ఫార్మా డైరెక్టర్ డాక్టర్ సీతారామయ్య, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రత్యూష, ఫార్మా కాలేజ్ హెచ్‌ఓడి డాక్టర్ దేసు బ్రహ్మ శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.