9 April, 2026 | 1:14 PM

దళిత బిడ్డకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్

09-04-2026 11:19 AM

పాలిటెక్నిక్ కొత్తగూడెం ఎలక్ట్రికల్ శాఖాదిపతి

కొత్తగూడెం, (విజయక్రాంతి): కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలోని అంగోత్ తారాసింగ్  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం లో "సోలార్ ద్వారా రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో యాక్టివ్ , రియాక్టివ్ పవర్ ల నియంత్రణ" అనే అంశం పై చేసిన పరిశోధనకు హైదరాబాద్ లోనీ ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో నీ ఇంజనీరింగ్ కళాశాలలో  ఎలక్ట్రికల్ శాఖలో బ్యాచిలర్ , మాస్టర్ ఇంజనీరింగ్ లు పూర్తిచేసి ప్రస్తుతం కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ శాఖాధిపతి (హెచ్ ఓ డి) గా విధులు నిర్వహిస్తున్నారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే చదువు మీద మక్కువతో  పీహెచ్డీ.లో సీటు సాధించి గత ఆరు సంవత్సరాలుగా ,నిరంతర కృషితో  పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించారు.

ఈ సందర్భంగా సాంకేతిక విద్యాశాఖలోని గి,రిజన ఉద్యోగుల సంఘం కొత్తగూడెం పాలిటెక్నిక్ యూనిట్ తరఫున తారాసింగ్ ని సన్మానిoచారు. ఈ సందర్భంగా డి జి పి ఏ ఎల్ ఏ ,సంఘం నాయకులు దారావత్ శ్రీనివాస్ నాయక్, ఎస్సీ ఎస్టీ,ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి భూక్యా కష్ట నాయక్ ,సంఘం నాయకురాలు, గుగులోత్ స్వప్న మాట్లాడుతూ ,తమ కళాశాలలో శాఖాధిపతిగా పని చేస్తున్న ఆంగోత్ తారాసింగ్ పిహెచ్డి పట్టా సాధించినందుకు, గిరిజన జాతికి గర్వకారణం అని, ఇట్టి విజయం తోటి ఉద్యోగులకు ప్రేరణ కలిగిస్తుందని అన్నారు. అత్యున్నత విద్యా అర్హత కలిగిన శాఖాధిపతి ఉండడం వలన అధిక సంఖ్యలో  నిమ్న కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని  సంతోషం వ్యక్తం చేశారు.

తారాసింగ్ మాట్లాడుతూ, తమ పీహెచ్డీ విద్యకు సహాయ సహకారాలు అందించిన, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ,శ్రీదేవసేన  సాంకేతిక విద్యా , శిక్షణ మండలి సెక్రటరీ శ్రీ పుల్లయ్య కి, కళాశాల ప్రధానాచార్యులు శ్రీ బండి శ్రీనివాస్  మిగతా శాఖాధిపతులకు , గిరిజన జాతి నాయకులకు, అధ్యాపకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం తారాసింగ్ కి అభినందనలు తెలియజేశారు.