08-12-2025 08:18:53 PM
వైద్యులను అభినందించిన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన ఓ యువతి(28) శనివారం సాయంత్రం తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. రెండు రోజుల చికిత్స తర్వాత సోమవారం స్కానింగ్ చేసి అండాశయం మెలికపడిందని గుర్తించి వెంటనే శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయ స్థితి నుంచి వైద్యులు కాపాడారు. ఈ శస్త్ర చికిత్స చేసిన డాక్టర్. స్రవంతి, భవానిలను ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి శస్త్ర చికిత్సలయిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని జిల్లా ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.