08-12-2025 08:21:07 PM
సీఐ బాలాజీ వర ప్రసాద్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ బురుగుడలో సోమవారం తన సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లూడుతూ పోలీస్ శాఖ ఏ ఒక్కరికో సొంతం అనుకుంటే పొరపాటేనని, యావత్ ప్రజానీక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు ముందుంటున్నారని తెలిపారు. పోలీసులు నిత్యం ప్రజల వెన్నంటి ఉంటారనే నమ్మకాన్ని కలిగించడమే ఫ్లాగ్ మార్చ్ లక్ష్యమని పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఎన్నికల నియమాల లోబడి నడుచుకోవాలని అన్నారు. సమస్యలు సృష్టించే వారిని గుర్తిస్తూ ముందస్తుగా తహశీల్దార్ ముందు బైండోవర్ చేస్తున్నామని తెలిపారు.