బాలుడిపై వీధికుక్కల దాడి

25-04-2024 01:59:58 AM

తలకు తీవ్ర గాయాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): బెజ్జుర్ మండలం కుష్ణపల్లి పంచాయతీ పరిధిలోని ఉంధ్రీగాం లో ఇంటిముందు ఆడుకుంటున్న సాయితేజ అనే బాలుడిపై కుక్కలు బుధవారం దాడి చేశాయి. దీంతో బాలుడి తలపై తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించిన కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు.