calender_icon.png 22 May, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి

22-05-2025 12:16:48 AM

-సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహర

చార్మినార్, మే21.. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలోని ఛత్రినాక ఏసిపి చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ ఆధ్వర్యం లో ఆర్. డి.ఫంక్షన్ హాల్‌లో తల సేమియా బాధితుల కోసంబుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహర హాజరై ప్రారంభించారు.

ఈ రక్తదాన శిబిరానికి ప్రజలు,పోలీస్ సిబ్బంది, పాత్రికేయుల నుంచి విశేషమైన స్పంద న లభించింది. దాదాపుగా 200 మంది వరకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డిసిపి స్నేహమేహర మాట్లాడు తూ.. దేశంలో తల సేమియా వ్యాధి బారిన పడి ఎంతోమంది చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోవడం బాధాకరమన్నారు.

తలసేమియా వ్యాధి వచ్చి న వారికి రక్తం అధికంగా అవసరం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ప్రా ణాలను కాపాడడానికి వైద్యులు కృషి చేస్తున్నారని, ప్రజలు తమ వంతు బాధ్యతగా రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడుకునే క్రమంలో భాగ్య స్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఛత్రినాక ఏసిపి చంద్రశేఖర్. ఛత్రినాక సీఐ .నాగేంద్ర ప్రసాద్ వర్మ. డి ఐ పి. గోపాల్ రావు. మొగల్ పుర సీఐ శ్రీను. మొగల్ పుర డిఐ అశోక్ .శాలిబండ సిఐ మహేష్ గౌడ్ .శాలిబండ డిఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.