calender_icon.png 22 May, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముషీరాబాద్‌లో వర్షం

22-05-2025 12:18:30 AM

-రోడ్లపై నిలిచిన వర్షం నీరు

-బురదమయంగా మారిన రాజాడీలక్స్ చౌరస్తా రోడ్డు

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి) : ముషీరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పద్మశాలి కాలనీ లోని 1-4-27/72/30 ఇంటి ముందు గల చెట్టు వర్షం తాకిడికి పూర్తిగా వంగిపోయి విద్యుత్ తీగలపై ఆగింది. వృక్షం ఎప్పుడు కూలుతు ందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

దాయార మార్కెట్ నుంచి రాజా డీలక్స్ చౌరస్తా వరకు రోడ్డంతా బురద మయంగా మారడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. మంచినీటి పైపైన్ నిర్మాణ అనంతరం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్శిగుట్ట, బాపూజీనగర్, వినోభానగర్ లో వర్షంనీరు పెద్దఎత్తున రోడ్లపై ప్రవహించాయి. దీనితో ప్రజలు ఇబ్బంది పడ్డారు.