calender_icon.png 22 May, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోదర భావంతో పండుగలు నిర్వహించాలి

22-05-2025 12:16:11 AM

ఖమ్మం ఏపీసీ రమణమూర్తి 

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 21 (విజయ క్రాంతి)మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఖమ్మం జిల్లాలో బక్రీద్, హనుమాన్ జయంతి పండుగలను సోదర భావంతో జరుపుకోవా లని టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. ఖమ్మం టౌన్ ఏసీపీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఖ మ్మం టూ టౌన్ ,ఖానాపురం హవేలీ,త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల లో కూడా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.   ఈ సందర్భంగా టౌన్ ఏసీపీ మాట్లాడుతూ ..

బక్రీద్ ,హనుమాన్ జయంతి పండుగ పర్వదినాలను శాంతియుత వాతావరణం లో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల మీ దుగా వచ్చే పశువుల అక్రమ రవాణా కట్టడికి కమిషనరేట్ పరిధిలో పశుసంవర్ధక శాఖ సిబ్బందితో  7 చెక్ పోస్ట్ లు ఏ ర్పాటు చేసి పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉంటేనే, పరిశీలించి అనుమతిస్తారని అన్నారు. ప్రధానంగా నిబంధన లు విరుద్ధంగా పశువులు అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,

చట్టాన్ని ఏవరు కూడా తమ చేతుల్లోకి తీసుకొని శాంతిభధ్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు తీసుకొనిరావద్దని అన్నారు. ఏదైనా సమస్య వుంటే సామరస్య పరిష్కారానికి పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో వుంటారని అన్నారు. ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతి భద్రతల సమస్యగా తలెత్తె ప్రమాదం వుంటుంది కాబట్టి వివిధ వర్గాల మతపెద్దలు యువతకు సమన్వయం పాటించేలా దిశానిర్దేశం చేయాలని అన్నారు.

ప్ర ధానంగా నగరంలో  ఏ చిన్న సంఘటన జరిగిన ఎడిటింగ్ చేసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ఐక్యతను, సామర స్యానికి భంగం కలిగించే విధంగా విద్వేషాలు, రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు పెట్టడం తద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్న వారిపై పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా పెట్టిందని తెలిపారు.అదేవిధంగా సభలు, సమావేశాలు,ర్యాలీలకు ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని,

తద్వారా అవసరమైన భద్రతను కల్పించేందుకు దో హదపడుతుందని అన్నారు.ఈద్గా ప్రాంతాలలో ముస్లిం సోదరుల సామూహికంగా ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగ కుండా ట్రాఫిక్ ,పార్కింగ్ ,పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ప్రత్యేక చోరవ తీసుకోవడం జరుగుతుందని అన్నారు.   

ఈ సందర్బంగా వివిధ మత పెద్దలు తమ అభిప్రాయాలను వెల్లడించి పోలీసు తీసుకుంటున్న ముందస్తు జా గ్రత్త చర్యకు తమవంతు సహకాహరం అందజేస్తామని అన్నారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్త్స్ర మౌలానా పాల్గొన్నారు.