calender_icon.png 18 August, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల గది నిర్మాణానికి విరాళం

18-08-2025 04:50:26 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు గది నిర్మాణం కోసం కాంగ్రెస్ మండల నాయకుడు ఐటిపాముల రవీంద్ర 20వేల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ పాఠశాల అదనపు గది నిర్మాణం కోసం తన వంతు సహాయాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రవీంద్ర ను పాఠశాల హెచ్ఎం శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకుడు బత్తిని సహదేవు అభినందించారు.