calender_icon.png 18 August, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ సంఘం ఆధ్వర్యంలో కాటమయ్యకు ప్రత్యేక పూజలు

18-08-2025 04:53:27 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని కాటమయ్య దేవాలయంలో సోమవారం గౌడ కులస్తులు మారగోని మల్లయ్య, మారగోని విష్ణు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో కాటమయ్యకు పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.