18-08-2025 04:47:29 PM
జాజిరెడ్డిగూడెం: బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని గౌడసంఘం నాయకులు అన్నారు. పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా సోమవారం జాజిరెడ్డిగూడెం గ్రామంలోని గౌడ కమ్యూనిటీ హాల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ... సాధారణ కుటుంబంలో పుట్టి, గీత కార్మికుడిగా కొనసాగిన తన ప్రస్థానంలో అణిచివేత, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు పాపన్న గౌడ్ అని కీర్తించారు.