18-05-2025 04:07:05 PM
భూపాలపల్లి (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా ఘనపురంలో ఉన్న కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళలో గోశాల నిర్వహణకు భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు 56 వేల రూపాయలు అందజేశారు. సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిని దర్శించుకోగా, ఆలయ అర్చకుడు జూలపల్లి నాగరాజు గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోశాల నిర్వహణలో పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాలలో గోవులకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.