calender_icon.png 18 May, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా థియేటర్లు బంద్.. ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

18-05-2025 05:26:37 PM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు(Movie theaters) బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు(Exhibitors) తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు(Producer Dil Raju), సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.