18-05-2025 03:59:25 PM
అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్..
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం దళితుడని అవమానించడమేనని దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాద్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మొయ్య రాంబాబు, కనకం రవీందర్ లు డిమాండ్ చేశారు. దళిత ఎంపీని అడుగున అవమా నించడంపై అంబేద్కర్ విగ్రహం ఎదుట అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
అధికార పార్టీకి చెందిన దళిత ఎంపీకి ఆహ్వానం అందకపోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారుల పాత్రపై విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మనువాద బావజాలంతో వ్యవహరిస్తూ ఉద్దేశపూర్వకంగానే శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాల సందర్భంగా పెద్దపల్లి దళిత ఎంపీని అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత ఎంపీని చిన్నచూపు చూసినా వారిపై వెంటనే చర్యలు చేపట్టి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, లేకుంటే అంబేద్కర్ సంఘం ఆద్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నెరువట్ల శ్రీనివాస్, పాత వీరస్వామి, కోడిపెల్లి రాజయ్య, గంధం పున్నం, బన్న చందర్, కనకం రాజ్ కుమార్, విక్కి, సాయికుమార్, విజయ్, విష్ణు, సంజీవ్, నవీన్ లు పాల్గొన్నారు.