calender_icon.png 18 May, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి కాంగ్రెస్ పీఠం.. దక్కేది ఎవరికో..?

18-05-2025 05:03:10 PM

ఎమ్మెల్యే సామెల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఆశావాదులు..

అధ్యక్ష పీఠంలో... ప్రస్తుతం బహుముఖ.. పోటీ..

సీనియర్లు... జూనియర్ల పేరిట గ్రామాల్లో.. లొల్లి... లొల్లి..

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతుండడం మరొక ప్రక్క రెండు సంవత్సరాల పైగా కాల పరిమితి పూర్తి కావడంతో పార్టీ బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలకు నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుండగా తుంగతుర్తి నియోజకవర్గ పరంగా ప్రతి మండలంలో, గ్రామాల్లోనూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జూనియర్ నాయకుల మధ్య ప్రస్తుతం కమిటీ ఎన్నిక ప్రక్రియ సయోధ్యగా మారింది.

ఏకంగా మండల కమిటీ సమావేశాల్లో నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఒక ప్రక్క లొల్లిలు మరొక ప్రక్క భాయి భాయి అంటూ గల్లాలు పట్టుకుంటూ దాడులు చేసుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయి. వీరి పరిస్థితిని చూసి ఏకంగా ప్రతిపక్ష నాయకులు నవ్వుకునే విధంగా జరుగుతుండడం గమనార్వం. తుంగతుర్తి మండలంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంగరి గోవర్ధన్, గుండాగాని మహేందర్ గౌడ్, చింతకుంట్ల వెంకన్న, చిలుకల వెంకన్న, కలకోట్ల మల్లేష్, నల్లు రామచంద్రారెడ్డి, ఉప్పుల రాంబాబుతో పాటు పలువురు ఆశావాదులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పరిశీలకులు ఎమ్మెల్యే రాముల నాయక్ కు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. మండల పార్టీ అధ్యక్ష పదవిపై ఎవరి ప్రయత్నాలు వాళ్ళు జరుగుతుండడం, ఎవరికి మండల పార్టీ అధ్యక్ష పీఠం దక్కేదో వేసి చూడాల్సిన సుమ.