12 April, 2026 | 3:28 AM

రాజన్న ఆలయానికి రూ.35లక్షల విరాళం

28-06-2024 05:44 AM

రాజన్న సిరిసిల్ల, జూన్27(విజయక్రాంతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఓ భక్తుడు రూ.35 లక్షల విరాళాన్ని అందించారు. గురువారం ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సికింద్రాబాద్‌కు చెంది న గల్లా గుండయ్య సామివారి అన్నదాన ట్రస్ట్‌కు రూ. 25 లక్షలు, గోశాలలో రాజన్న కోడెల సంరక్షణకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఆలయ ఏఈవో ప్రతాప నవీన్, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములుకు చెక్కు ను అందించారు. ఈ సందర్భంగా ఆయనకు రాజన్న ప్రసాదాలు అందించి సత్కరించారు.