27-11-2025 05:06:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): వశిష్ఠ హై స్కూల్ ఆదర్శ్ నగర్ విద్యార్థులు శ్రీ సాయి అనాధ వృద్ధాశ్రమం, మంచిర్యాల వారికి తమవంతు సాయంగా విరాళాలు సేకరించి అందజేశారు. మొత్తం 18,860 రూపాయలు విరాల రూపంలో సేకరించారు. సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ విధంగా సేవ దృక్పథంతో ముందుకురావడం గొప్పదని, ఈ వయస్సు నుండే వారిలో సేవ భావన నేర్పించిపడం ముఖ్యమని, అనాధ అని అనుకునే వాళ్ళకి ఈ విధంగా మన మందరం తోడున్నాం అని తెలపాలని కోరుతూ విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా అధిక విరాళాలు సేకరించిన పిల్లలకు మెడల్స్ ప్రదానం చేశారు, వీరిలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులు నౌమన్-6th, శ్రవణ్-8th, రక్షిత్-8th, కేతన్ నాయక్-1st, ఆర్యన్-3rd లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.