calender_icon.png 27 November, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం

27-11-2025 04:58:37 PM

పాపన్నపేట (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల నిబంధన మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లాలో పకడ్బందీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అబ్జర్వర్ భారతి లక్పత్ నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అబ్జర్వర్ భారతి లక్పత్ నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, డిపిఓ యాదయ్యతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ మాట్లాడుతూ.. గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావలసిన ధృవ పత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆమె సూచించారు. నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిల్లో ఏవైనా తప్పులు వుంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల నిబంధన మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, జిల్లాలో పకడ్బందీగా, పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.