హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం
06-04-2026 03:43 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి తన వంతు గా కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీ చెందిన కృష్ణానంద స్వాములు రూ. 5,100/- విరాళం అందజేశారు. హిందూ సమాజాన్ని అభివృద్ధి పథంలో పయనించాలని సంఘటితం కావాలని ఏర్పాటు చేస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి తన వంతు సహకారాలు అందజేసినట్లు కృష్ణానంద స్వాములు తెలిపారు. హిందూ ధార్మిక సంస్థలకు సహకరించాలని స హిందువులందరూ సమైక్యత భావాన్ని అలవర్చుకొని మన బంధువులందరూ హిందూ సమాజాన్ని అభివృద్ధి పథంలో పయనించాలని సంఘటితం కావాలని అన్నారు. ప్రతి ఒక్క హిందువులు హిందూ సమ్మేళనానికి కదిలి రావాలని కృష్ణ నంద స్వాములు కోరారు.




